
మండలంలోని పోసానిపేట గుడిగంటలు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శివరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ ఘనంగా నిర్వహించింది. స్వామివారి కల్యాణోత్సవం, స్వామి వారి ఊరేగింపు, గ్రామంలో ప్రధాన వీధిలో రథోత్సవం, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణతో ఆలయం మారుమోగింది. ఆలయాన్ని ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్మోహన్ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నా రెడ్డి మహిపాల్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.