Thursday, May 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఐపీఎస్ అధికారికి షాక్

ఐపీఎస్ అధికారికి షాక్

- Advertisement -

బస్టాండ్‌లో పోకిరీల వెకిలిచేష్టలు
మఫ్టీలో మల్కాజిగిరి 
పోలీస్ కమిషనర్
కదలనివ్వకుండా 
చుట్టుముట్టిన ఆకతాయిలు
వస్తావా.. నీ రేటు ఎంత..? 
అంటూ అసభ్యకరంగా ప్రవర్తన
40 మందిని అదుపులోకి 
తీసుకున్న పోలీసులు

విచారణ అనంతరం కౌన్సెలింగ్
నగరవాసుల నుంచి సీపీకి వెల్లువెత్తుతున్న అభినందనలు

నవతెలంగాణ – దిల్‌సుఖ్‌నగర్
హైదరాబాద్ నగరంలో ఆకతాయిలు మఫ్టీలో ఉన్న ఐపీఎస్ అధికారికే షాక్ ఇచ్చారు. బస్టాండ్‌లో నిల్చున్న ఆ అధికారిని ముందుకు కదలనివ్వకఁండా చుట్టుముట్టారు.. వస్తావా..? నీ రేటు ఎంత..? అంటూ అసభ్యకరరీతిలో మాట్లాడుతూ పోకిరీలు రెచ్చిపోయా రు. చివరికి సుమారు 40 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించిన అనంతరం వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ అధికారి సుమతి కమిషనరేట్ పరిధిలో గ్రౌండ్ లెవెల్ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం అర్ధరాత్రి 12గంటల సమయంలో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మఫ్టీలో సాధారణ మహిళలా దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్‌లో నిల్చున్నారు. ఆమె ఎవరో తెలియని కొందరు పోకిరీలు చుట్టుముట్టారు. వస్తావా నీ రేటు ఎంత..? అంటూ ఆకతాయిలు వెకిలి ప్రశ్నలతో రెచ్చిపోయారు. దాదాపు 40 మంది ఆమె వెంటపడ్డారు. ఆ సమయంలో ఎలాంటి పెట్రోలింగ్ వాహనంగానీ, గస్తీ పోలీసులుగానీ అక్కడికి రాకపోవడంతో వారు మరింత రెచ్చిపోయారు. వారిలో ఎక్కు వగా విద్యార్థులు, ఉద్యోగులు ఉండటం గమనార్హం. కొంతమంది గంజాయి, మద్యం సేవించిన వారున్నారు. అర్ధరాత్రి 12గంటల నుంచి తెల్లవారుజామున 3గంటల వరకఁ పోకిరీలు హంగామా సృష్టించారు. మహిళలు ఒంటరిగా ఉంటే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో స్వయంగా తెలుసుకోవడానికే పోలీస్ కమిషనర్ ఈ సాహసం చేశారు. ఉదయం మూడున్నర గంటల తర్వాత అక్కడికొచ్చిన ఒక బీట్ కాఁస్టేబుల్ కమిషనర్‌ను గుర్తించారు. ఆ తర్వాత ఎస్ఐ వచ్చి సెల్యూట్ చేయడంతో ఆమె మల్కాజిగిరి సీపీగా బయటపడింది. ఈ ఆపరేషన్‌లో 40మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారీ తప్పులు చేయకఁండా హెచ్చరించారు. కాగా ఓ పోలీస్ కమిషనర్ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకోవడానికి స్వయంగా అదీ ఒంటరిగా వడు గంటలపాటు బస్టాండ్‌లో ఉండి పోకిరీల చేష్టలను పరిశీలించడంపై నగరవాసుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -