తమిళనాడు గవర్నర్‌తో విజయ్ భేటీ
పూర్తి మెజార్టీ లేదుగా? : గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
మద్దతుకు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెడీ
టీవీకే సర్కార్ ఏర్పాటుకు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు అవసరం
నేడు ప్రమాణస్వీకారం?
మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన రజనీకాంత్
వీసీకే, సీపీఐ (ఎం), సీపీఐ మద్దతు కోసం కూడా విజయ్ ప్రయత్నిస్తున్నారు. టీవీకేతో పొత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వీసీకే ఎంపీ రవికు మార్ చెప్పారు. విజయ్‌తో సమావేశమైన తర్వాత కాంగ్రెస్ నేత చక్రవర్తి విలేకరులతో మాట్లాడుతూ గురువారం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందఁ, దీనికి తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారని చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో డీఎంకేతో కొనసాగుతున్న దీర్ఘకాల సంబంధాలకఁ కాంగ్రెస్ స్వస్తి చెప్పినట్టు కనిపిస్తోంది. టీవీకేతో పొత్తు ప్రభుత్వ ఏర్పాటుకే పరిమితం కాబోదని, స్థానిక ఎన్నికలు, లోక్‌సభ`రాజ్యసభ ఎన్నికలలోనూ కొనసాగుతుంద ని కాంగ్రెస్ తెలిపింది. తమిళనాడులో ఏర్పడబోయేది లౌకిక ప్రభుత్వమని అభివర్ణించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు న్యూఢిల్లీలో సమావేశమై తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే అధ్యక్షుడు విజయ్ తమ మద్దతు కోరారని చెప్పారు. ఇదిలావుండగా విజయ్ కు మద్దతు కూడగట్టడం కోసం వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్‌తో కాంగ్రెస్ చర్చలు జరుపుతోందని తెలిసింది. విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వామి కావాలని అన్నా డీఎంకే భావించింది. అయితే కాంగ్రెస్‌తో అవగాహనకు వచ్చిన విజయ్ ..అన్నా డీఎంకేతో చర్చలకు బ్రేక్ వేశారు. టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంలో అన్నా డీఎంకేలో అభిప్రాయబేధాలు తలెత్తాయని తెలుస్తోంది.
మీ దగ్గర మ్యాజిక్ నంబర్ లేదుగా:
విజయ్‌తో గవర్నర్..
తమిళనాడులో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేత విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. కాంగ్రెస్ ఇచ్చిన మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరారు. అయితే విజయ్ చూపించిన సంఖ్యాబలంపై గవర్నర్ సంతృ ప్తి వ్యక్తం చేయలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు ఇంకా తగినంత సంఖ్యాబలం లేదని ఆయన భావిస్తున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్నే ఆయన విజయ్‌తో చర్చించినట్టు.. 118 సభ్యులు సమకూరిన అనంతరమే రావాలని సూచించినట్టు వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో అసెంబ్లీ స్థానాల సంఖ్య 234 కాగా.. 108 చోట్ల గెలిచి టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 118. కాంగ్రెస్‌కు ఐదు సీట్లతో పాటు విజయ్ గెలిచిన రెండు సీట్లలో ఒకదాన్ని మినహాయిస్తే.. సంఖ్య 112కు పెరిగింది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు మరో ఆరుగురి మద్దతు కావాల్సి ఉంది. విజయ్ బృందంలోకి ఇంకా ఎవరెవరు వస్తారనే దానిపై స్పష్టత లేదు. దీంతో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటకు విజయ్‌ను ఆహ్వానించలేకపోయినట్టు సమాచారం.
మద్దతిచ్చేది లేదన్న ఆ పార్టీలు..
విజయ్ టీవీకే పార్టీకి తాము మద్దతివ్వబోమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంల్), లెఫ్ట్ పార్టీలు తేల్చి చెప్పాయి. తాము డీఎంకే కూటమిలోనే ఉంటామని పేర్కొన్నాయి. మరోవైపు డీఎంకే మిత్రపక్షమైన వీసీకే.. టీవీకే పార్టీకి మద్దతిచ్చే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తమిళనాడులో సీపీఐకి 2, సీపీఎంకి 2, ఐయూఎంఎల్‌కు 2, వీసీకేకు 2 సీట్లు ఉన్నాయి.
స్టాలిన్‌ను కలిసిన రజనీకాంత్
మర్యాదపూర్వక భేటీయే అంటున్న డీఎంకే వర్గాలు సూపర్ స్టార్ రజనీకాంత్ డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ను కలిశారు. బుధవారం రోజు వీరిద్దరూ మర్యాదపూర్వక భేటీ అయినట్టు డీఎంకే వర్గాలు తెలిపాయి. అయితే, రాష్ట్ర ఎన్నికల్లో డీఎంకేకు ఎదురైన పరాజయం నేపథ్యంలో, రజనీకాంత్ స్టాలిన్‌కు తన సంఘీభావాన్ని తెలియజేశారని సమాచారం. స్టాలిన్‌ను భారత రాజకీయాల్లో ఒక అగ్రశ్రేణి నాయకుడిగా ఆయన కొనియాడారు.
మ్యాజిక్ ఫిగర్ కు స్వల్ప దూరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



