Monday, May 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం

వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం

- Advertisement -

15- 30 రౌండ్ల ఫైరింగ్
సీక్రెట్‌ సర్వీస్‌ 
చెక్‌పాయింట్‌ వద్ద కాల్పులు
ఎదురుకాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మృతి

వాషింగ్టన్: అమెరికా శ్వేతసౌధం సమీపంలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. వైట్‌హౌస్‌ భద్రతా చెక్‌పాయింట్‌ వద్దకు వచ్చిన ఓ దుండగుడు అకస్మాత్తుగా శనివారం సాయంత్రం(అక్కడి కాలమానం ప్రకారం) సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బందిపై కాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ప్రతిగా అధికారులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డా డు. అతడిని సమీప ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అధికారికంగా వెల్లడించింది. సీక్రెట్‌ సర్వీస్‌ తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత ఓ వ్యక్తి వైట్‌హౌస్‌ సమీపంలోని చెక్‌పాయింట్‌ వద్దకు వచ్చాడు. తన వద్ద ఉన్న బ్యాగ్‌లో నుంచి ఆయుధాన్ని తీసి అక్కడ విధుల్లో ఉన్న అధికారులపై కాల్పులు ప్రారంభించాడు. దీంతో సిబ్బంది వెంటనే ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు కుప్పకూలిపోయాడు. ఘటనలో సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బందికి ఎలాంటి గా యాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. కాల్పుల సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లోనే ఉన్నట్టు అధికారులు తెలిపారు.

అధ్యక్షుడి భద్రతకు భంగం కలగలేదు!
అధ్యక్షుడి భద్రతకు భంగం కలగలేదని సీక్రెట్‌ సర్వీస్‌ పేర్కొంది. ఘటన అనంతరం వైట్‌హౌస్‌ సముదాయాన్ని కొంతసేపు పూర్తిగా లాక్‌డౌన్‌ చేశారు. నార్త్ లాన్‌ ప్రాంతాన్ని ఖాళీ చేయించి భద్రతా వలయాన్ని మరింత కట్టుదిట్టం చేశారు. కాల్పుల శబ్దాలు వరుసగా వినిపించడంతో వైట్‌హౌస్‌ వద్ద విధుల్లో ఉన్న జర్నలిస్టులు ఒక్కసారి గా భయాందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు 15 నుంచి 30 రౌండ్ల వరకు కాల్పుల శబ్దాలు వినిపించినట్టు తెలిపారు. వెంటనే సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు జర్నలిస్టులను బయట కు వెళ్లకుండా అడ్డుకొని ప్రెస్‌ బ్రీఫింగ్‌ రూమ్‌లోకి వెళ్లాలని సూచించారు. ఘటన చోటుచేసుకున్న ప్రాంతం వైట్‌హౌస్‌కు సమీపంలో ని 17వ స్ట్రీట్‌, పెన్సిల్వేనియా ఎవెన్యూ జంక్షన్‌గా గుర్తించారు. కాల్పుల తర్వాత అక్కడ భారీగా పోలీసు బలగాలు, ఫెడరల్‌ ఏజెన్సీల సిబ్బంది మోహరించారు. ఘటనాస్థలిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రహదారులపై క్రైమ్‌సీన్‌ టేపులు ఏర్పాటు చేసి ఆధారాలను సేకరించారు. కాల్పుల ఘటనలో మరో వ్యక్తి కూడా గాయపడినట్లు సమాచారం.

భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం
ఘటనపై ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ కూడా స్పందించారు. వైట్‌హౌస్‌ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనపై సీక్రెట్‌ సర్వీస్‌కు సహకరిస్తున్నామని ఆయన ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. “వైట్‌హౌస్‌ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనపై ఎఫ్‌బీఐ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దర్యాప్తులో భాగస్వామ్యం అవుతున్నాం. పరిస్థితిపై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం” అని పేర్కొన్నారు. అమెరికా మీడియా కథనాల ప్రకారం, ఘటన తర్వాత వైట్‌హౌస్‌ భవనం పైభాగంలో కౌంటర్‌ స్నైపర్లను కూడా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు. కొంతసేపటి తర్వాత పరిస్థితి అదుపులోకి రావడంతో తాత్కాలిక లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. ఇటీవలే వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్‌ డిన్నర్‌ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం కేసు అమెరికాలో సంచలనం సృష్టించింది.

ఆ ఘటన తర్వాత భద్రతా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. అయినప్పటికీ మరోసారి వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పుల ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉండగా, అమెరికా రాజకీయ నాయకులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో రాజకీయ హింసకు తావులేదని, ఇటువంటి ఘటనలు ఆందోళనకరమని పలువురు నేతలు పేర్కొన్నారు. ప్రస్తుతం ఘటనకు సంబంధిం చిన పూర్తి వివరాలను సీక్రెట్‌ సర్వీస్‌, ఎఫ్‌బీఐ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. దుండగుడి ఉద్దేశం ఏమిటి? అతడు ఒంటరిగా వచ్చాడా? లేదా మరెవరైనా సహకరించారా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోందని ఆరా తీస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -