సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి 

Be vigilant about cybercrime– ఏఎస్పి అవినాష్ కుమార్  
నవతెలంగాణ –  కుబీర్
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఏ ఎస్పి అవినాష్ కుమార్ సూచించారు. ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు కుబీర్ మండలంలోని చొండి గ్రామంలో బైంసా రూరల్ సీఐ నైలు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. పోలీస్ బలగల తో గ్రామంలో ప్రతి ఇంటి ఇంటికి తనిఖీ చేశారు.ఇందులో 57 బైకులు 5 ఆటోలు 1 కారు కు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో వాహనాలను సీజ్  చేసి వారికి తగిన జరిమానా విదినచడం జరిగింది. అనంతరం గ్రామపంచాయతీ సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బైంసా ఏఎస్పి అవినాష్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామంలో ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని సూచించారు. నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషించే సీసీ కెమెరాలను గ్రామంలోని ప్రధాన వీధులలో ఏర్పాటు చేసుకోవాలని కోరారు. యువకులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా చదువుపై శ్రద్ధ చూపి జీవితంలో స్థిరపడాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఎస్సై లు రవీందర్, అశోక్, శంకర్  పోలీస్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.
Spread the love