నవతెలంగాణ – కుబీర్
రానున్న రోజులో రంజాన్ పండగ ప్రారంభం కావడం జరుగుతుంది. దింతో మండలంలోని ఆయా గ్రామాల ముస్లిం సోదరులు పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని బైంసా రూరల్ సి ఐ నైలు అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన కుబీర్ పోలీస్ స్టేషన్ లో ముస్లిం సోదరలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నిర్మల్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బైంసా డివిజన్ ఏ ఎస్పీ అవినాష్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నెల రోజుల పాటు కఠోర ఉపవాసలు ఉండి రంజాన్ పండగను జరుపుకుంటారు. దింతో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో కుబీర్ ఎస్ ఐ రవీందర్ పోలీస్ సిబ్బంది ముస్లిం మాత పెద్దలు తదితరులు ఉన్నారు.