బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్ ) విధులు, నూతన ప్రమాణాలు, నాణ్యత నియంత్రణ చర్యలు, పరిశ్రమలకు ఇచ్చే సర్టిఫికెట్లు, వినియోగదారులకు లభించే ప్రయోజనాలను తెలియజేయడానికి బీఐఎస్ చేపట్టిన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అధికారులను కలిసి బ్రోచర్లు అందజేసినట్లు క్యాట్కో రాష్ట్ర కార్యదర్శి పోచం సోమయ్య, జిల్లా బాధ్యులు కొడారి వెంకటేష్ లు తెలిపారు . బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) , ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం – మార్చి 15 -2025 తర్వాత మార్చి 16 నుండి ఏప్రియల్ 05 వరకు జిల్లా వ్యాప్తంగా జిల్లా అధికారులను కలిసి “క్వాలిటీ కనెక్ట్ క్యాంపేయిన్7.0” పై అవగాహన కల్పిస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల క్లబ్ లో సభ్యులు తోట సాయి ప్రణీత్ , ఆకోజు విరాట్ లు పాల్గొన్నారు.