నవతెలంగాణ-బెజ్జంకి : ప్రభుత్వం ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గంగాపూర్ సొసైటీ చైర్మన్ ముల్కల కనకరాజు సూచించారు.బుధవారం మండల పరిధిలోని చెర్లంకిరెడ్డి పల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ కనకరాజు కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు.రైతు సంక్షేమమే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని మద్ధతు ధర పొందాలని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజ్జు యాదవ్ కోరారు.బీసీ సెల్ జిల్లా కార్యదర్శి చిక్కుడు అనిల్ కుమార్, మాజీ ఎంపీటీసీ గంగా సరిత,ఏఈఓ శిరీష,గ్రామపంచాయతీ కార్యదర్శి గీతాంజలి,రైతులు పాల్గొన్నారు.