– మంత్రి పియూష్ గోయల్
న్యూఢిల్లీ : భారత స్టార్టప్ సంస్థలు ఆలోచనలు మారాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు. చైనా తరహాలో డీప్ టెక్ స్టార్టప్‌లపై దృష్టి పెట్టాలని సూచించారు. స్టార్టప్ మహాకుంబ్ కార్యక్రమంలో పియూష్ గోయల్ మాట్లాడుతూ.. దేశంలోని పలు స్టార్టప్ సంస్థలు ఫుడ్ డెలివరీ, బెట్టింగ్, ఫాంటసీ స్పోర్ట్స్ వంటి యాప్‌లపై ఎక్కువగా ఆలోచన చేస్తోన్నాయన్నారు. ఇలాంటి వాటి వల్ల దిగువ శ్రేణి కార్మికులు తయారై సంపన్నులు కాలు బయటపెట్టకుండా ఆహారం పొందగలుతున్నారన్నారు. మరోవైపు చైనా చైనా సంస్థలు ఎఐ, ఇవిలు, సెమీ కండక్టర్ల రంగాలను ఎంచుకుంటున్నాయన్నారు. భారత్‌లో 1000 డీప్ టెక్ స్టార్టప్‌లు మాత్రమే ఉండటం ఆందోళనకర మన్నారు. ఇక్కడి యువతరం రూ.25 లక్షలు, రూ.50 లక్షలకు తమ గొప్ప ఆలోచనలను విదేశీ కంపెనీలకు అమ్మేసుకుంటున్నారన్నారు. మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై జెప్టో సిఇఒ అదిత్ పలిచా తీవ్రంగా స్పందించారు. విమర్శించడం తేలిక అంటూ వ్యాఖ్యానించారు. భారత స్టార్టప్‌లను తక్కువ చేయొద్దని, డీప్‌టెక్ సంస్థల వృద్ధి కోసం ప్రభుత్వం ఎలాంటి సహాయం అందిస్తోందని తెలుపాలని ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్‌ఒ మోహన్‌దాస్ పారు ప్రశ్నించారు.