
– కమిటీ సభ్యుల నిర్ణయం
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 18 వ డివిజన్ ముబారక్ నగర్ కాలనీలో గల వివి నగర్ కాలనీ లో శ్రీ శివ సాయి బాబా మందిరం కార్యవర్గ కమిటీ సభ్యుల సమావేశం గురువారం నిర్వహించారు. శ్రీ శివ సాయి బాబా మందిరం మార్చ్ 24వ తేదీన 18వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నామని అధ్యక్షులు రాజేందర్ రెడ్డి తెలిపారు. వివి నగర్ కాలనీ వాసుల సహకారంతో, కమిటీ సభ్యుల సహకారంతో ప్రతి గురువారం నిరంతరం అన్నదాన కార్యక్రమాలను చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని శ్రీ శివ సాయి బాబా మందిరానికి సాయి భక్తులు విచ్చేసి అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకు రావాలి అని కోరారు.ఎవరైనా దాతలు ముందుకు వస్తె శ్రీ శివ సాయి బాబా మందిరానికి సంబంధించిన ఫోన్ నెంబర్ 9848673320,9666636408 సంప్రదించాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ కేక్రటరీ విశ్వజిత్ రెడ్డి, కోశాధికారి శ్యామ్ సుందర్ రెడ్డి,శ్రీ శివ సాయి బాబా మందిరం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.