రోజు కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మండలంలోని ప్రజలందరినీ ఉద్దేశించి పసర ఎస్ ఐ ఏ కమలాకర్ ముఖ్యమైన సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గురువారం కమలాకర్ మాట్లాడుతూ ఏడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, కాలువలు, చెరువులు ఉప్పొంగే అవకాశం ఉంది. కావున ఎవరు కూడా వాగుల వద్దకు కానీ, చెరువుల వద్దకు కానీ వెళ్లకూడదు అని ముఖ్యంగా యువకులు ఎవరు ఈతకు గాని, చేపలు పట్టుటకు గాని ముంపు ప్రాంతాల వద్దకు వెళ్లవద్దు అని తెలిపారు. జాలర్లు కూడా వర్షాలు పడుతున్న సమయం లో చేపలు వేటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. ఏదేని ప్రమాదం సంభవిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని తెలియచేసారు. ముందు ముందు కూడా వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.