నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని జాతీయ రహదారి161 జగనాథ్ పల్లి వద్ద ఎస్ఐ కొనారెడ్డి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ..వాహనదారులు పాత చాలాన్లను వెంటనే చెలించాలని అన్నారు. వాహన దారులు జాతీయ రహదారిపై ప్రయాణం చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ వాహనాలు నడిపి, ఇంటికి చేరుకోవాలని అన్నారు. అదే విదంగా వాహనదారులు వాహలన యొక్క ధ్రువీకరణ పత్రాలను వెంట ఉంచుకొని, ద్విచక్రవాహనంపై ప్రయాణం చేసే సమయంలో హెల్మెట్లు తప్పక ధరించి, జాతీయ రహదారి భద్రత నిమాయ నిబంధనలు పాటించాలని, లేని యెడల కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటు పోలీసు సిబ్బందీలు పాల్గొన్నారు.