తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల్లో పోలింగ్ ఈ నెలాఖరుతో ముగియనుంది. కొన్ని రాష్ట్రాల్లో పో లింగ్ కూడా ముగిసిపోగా మిగిలిన చోట్ల ప్రచారం 28తో పూర్తయి నవంబరు 30న ఓటేయడానికి ప్రజలు సంసిద్ధులవు తున్నారు. ఈ రెండు రోజుల్లోనూ ప్రధా నంగా తెలంగాణలో అన్ని పార్టీల అగ్ర నాయకులూ పర్యటించనుండటంతో ప్రచారం తారాస్థాయికి చేరుతుంది. క్రమేణా రూపుమారుతున్న ప్రచార పద్ధ తులూ, మీడియా, సోషల్ మీడియా సాధనాలు, నాయకుల పర్యటనలూ అన్నీ హోరెత్తాయి. ప్రజల తీర్పు ఎలా వుంటుందనే దానిపై అనేక రకాల సర్వే లు వెలువడ్డాయి గానీ ఇవేవీ ప్రభంజనం వస్తుందని చెప్పలేదు. పాలకపార్టీ బీఆర్‌ఎస్ గెలుస్తుందని ఎక్కువ సర్వేలు చెప్పగా కాంగ్రెస్ తప్పక విజయం సాధిస్తుం దని రెండు మూడు సర్వేలు చెప్పాయి. ఎన్నికల తేదీ దగ్గరైన కొద్ది బీఆర్ ఎస్ అనుకూల సర్వేలు జోరందుకు న్నాయి. టీవీ చర్చలలోనూ, కార్యక్రమాలలోనూ మొత్తం పైన సర్వేలను తోసిపారేయడమే గాక ఇవన్నీ స్పాన్సర్డ్ అనే రీతిలో ఎదురుదాడి చేస్తున్నారు. కానీ పార్టీలుగా మాత్రం అనుకున్న వాళ్లను రంగంలోకి దింపి రోజుకు రోజు ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసే ప్రయత్నాలు ఆపింది లేదు. బీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీ కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ అనేదానిపై మాత్రం ఏకాభిప్రాయం వున్నా తేడా మాత్రం పెరిగిపోతున్న స్థితి. కాంగ్రెస్ ప్రభంజనం నెలకొందన్న కథనాలతో అతి విశ్వాసం పెంచుకున్న ఆ పార్టీ ఇప్పటికీ అంతే నమ్మకంతో వుందా అనేది సందేహమే. ప్రచారపరం గా బీఆర్‌ఎస్‌కు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లు ముగ్గురు మూడు కోణాలలో ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ ప్రచార భారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాత్రమే మోయ వలసి వచ్చింది. సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క మాత్ర మే కొంత తోడు నిలిచారు. ముఖ్యమంత్రి ఎవరనే జాబితాలో ఈ ఇద్దరి పేర్లే ముందుండటం కూడా వాస్త వం. మిగిలిన నాయకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వంటివారెవరూ రాష్ట్ర వ్యాపితంగా పర్యటించడానికి సిద్ధం కాలేకపోయారు. వారి కుటుం బ సభ్యుల సీట్లలోనే దిగబడిపోయారు. నల్గొం డ జిల్లా వంటిచోటికి రేవంత్ రావడాన్ని స్వాగతించింది కూడా లేదు. కేసీఆర్ సహా బీఆర్‌ఎస్ నాయకులు కూడా రేవంత్‌పైనే అస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ కర్నాటక తరహా వాగ్డానాలతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తే బీఆర్‌ఎస్ ఉన్న పథకాల పెంపుతో పాటు కొన్ని కొత్త వాగ్దానాలు ప్రకటించింది. తెలంగాణ సాధన, అభి వృద్ధి, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నవీక రణ తమ వల్లనే జరిగిందని కాంగ్రెస్ వస్తే ఇదంతా కొట్టుకు పోతుందని బీఆర్‌ఎస్ ప్రధాన పల్లవిగా వుంది. 30 మందికిపైగా పాత ఎంఎల్‌ఎలను మార్చాలని అనే క సూచనలు వచ్చినా కేవలం పదిమందిని మాత్రమే కొత్త వాళ్లను తీసుకున్న కెేసీఆర్ నిర్ణయం ప్రభావం ఎన్నికల తర్వాత గాని తెలియదు. కొత్తగా టికెట్టివ్వ డానికి అవ కాశం లేకున్నా బీఆర్‌ఎస్ పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్థనరెడ్డి వంటివారితో ఆఖరి క్షణంలో చేర్చుకుంది. విజయశాంతి వంటివారి కాంగ్రెస్ ప్రవే శం కూడా అలాంటిదే. విధాన పరమైన నిబద్దత, రాజకీయ విలువలు లేకపో వడం వల్ల ఎన్నికల పోరాటం కాస్త పద వుల కోసం ఆరాటంగానే తయారైంది.
క్రమేణా మారిన దృశ్యం
బీజేపీ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా జరిగే జాతీయ పోరాటంలో బీఆర్‌ఎస్ ఒకకీలక భాగస్వామి అవు తుందనే నమ్మకం మునుగోడు ఎన్నిక కలి గించింది. ఆ సమయంలోనే ఆఫరేషన్ ఫాంహౌస్, లిక్కర్ స్కాం కేసు వంటివి రంగం మీదకు వచ్చాయి. బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపైనా తీవ్రస్థాయిలో దాడి చేశారు. రకరకాల కథనాల మధ్య ఈ వాతావరణం మారిపోయింది. కేసీ ఆర్‌తో సహా ఆ పార్టీ నేతలు ‘ఇండియా’, బీజేపీల మధ్య సమదూరం సిద్ధాంతం తీసుకున్నారు. కాంగ్రెస్ మా ప్రధాన ప్రత్యర్థి గనక దానిపై కేంద్రీకరిస్తున్నా మని చెప్పినా మోడీపై విమర్శ తగ్గడం వాస్తవం. అయితే ఎన్నికల ప్రచారం చివరిదశలో మాత్రం దీన్ని కొంత సరి దిద్దుకుని తామె ప్పుడూ లౌకిక పార్టీగానే వుంటామని కేసీఆర్,కేటీఆర్ ప్రత్యేకంగా ప్రకటించడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆ మూలాలున్న వారి ఓట్ల ప్రభావం, కుల పరమైన లెక్కలు నడిచినా ఆయనకు బెయిల్ రావడంతో అది తగ్గింది. ఉద్యోగాల భర్తీలో వెనకబాటే తమపై కొంత అసంతృప్తికి కారణమైందని కెేటీఆర్ బహిరంగంగానే వ్యాఖ్యానించిన ఉద్యోగార్థులతో సహా వివిధ తరగతుల వారిని మోడీ తరహాలో ఇంటర్వూలు చేస్తూ దగ్గర చేసుకోవడానికి ప్రయత్నించారు. నిజా నికి కేసీఆర్ గ్రామాలలో సభలు పెడుతుంటే కెేటీఆర్ ఆ సభలతోపాటు నగర వాసులతో చానళ్లు, సోషల్ మీడియా ద్వారా దగ్గరయ్యే ప్రయత్నం పెంచారు. మోడీ, అమిత్‌షాతో సహా బీజేపీ నేతలు మాత్రం పాలకపార్టీపై దాడి తీవ్రంగానే కొనసాగించారు. మతతత్వ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను అరెస్టు చేస్తామనీ బెదిరిస్తూనే వున్నారు. ఏమైనా వారి టార్గెట్ కాంగ్రెస్ అనేది స్పష్టం. హంగ్ వస్తుందని అప్పుడు తాము బీఆర్‌ఎస్‌ను లోబర్చుకుని చక్రం తిప్పాలనీ ఆశపడుతున్నారు. వారి ఎత్తుగడలు ఏమైనా అసలు కాంగ్రెస్ శిబిరంలోనే ఐక్యత లేకపోవడం, అనేకమంది ముఖ్యమంత్రులు ముందుకు రావడం షరా మామూ లుగా సాగుతున్నది. మజ్లిస్ నేత ఒవైసీ బీఆర్ ఎస్‌కే తమ మద్దతు వుంటుందని గట్టిగా ప్రకటించడమే గాక కాంగ్రెస్‌పై దాడి ఎక్కుపెట్టారు.
పేలవంగా జనసేన విన్యాసాలు
ఏపీలో టీడీపీ నేస్తమైన పవన్ కళ్యాణ్ జనసేన బీజేపీతో కలిసి ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తూ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, మోడీ మూడోసారి ప్రధాని కావాలని భక్తి చాటుకుంటున్నారు. అయితే ప్రచారం కూడా చేయకపోగా మొక్కుబడిపోటీతో జనసేన ఇక్క డ పలచనవడమే గాక ఏపీలోనూ నష్టపోతుందనే మాట అందరినోటా వస్తోంది. రిజర్వేషన్ వర్గీకరణ పే రిట మందకృష్ణ మోడీని దళితోద్ధారకుడిలా కీర్తించడం కూడా విమర్శకు గురైంది. బీజేపీ తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను తన చుట్టూ తిప్పుకోవడం కనిపి స్తుండగా కాంగ్రెస్ ఆ విధమైన విశాల వైఖరి తీసుకో వడంలో విఫలమైంది. షర్మిల వైఎస్‌ఆర్‌టిపి, ప్రొఫె సర్ కోదండరామ్ టిజెఎస్‌లను కూడా పోటీకి దూ రంగా వుంచింది. సీపీఐకి ఒక్క స్థానం మాత్రం ఇచ్చి పొత్తుపెట్టుకుంది. బీఆర్‌ఎస్‌గా పేరు మార్చుకుని జాతీయ పాత్ర నిర్వహిస్తామని హడావుడి చేసిన కేసీఆర్ తెలంగాణలో గెలవడం కోసం ప్రాంతీయ పార్టీగా పరిమితం చేసుకోవడం ఒక విచిత్రం, కాంగ్రెస్ ది కేవలం కల్పితమైన హైప్ మాత్రమేననీ తాము పూర్తి ఆధిక్యతతో గెలుస్తామని చెబుతున్న బీఆర్‌ఎస్ హంగ్ వస్తే బీజేపీ మద్దతు తీసుకునేది లేదని మాత్రం చెప్పడం లేదు. మరో వంక కాంగ్రెస్‌లో కలిసిన మాజీ బీజేపీ నేతలేమో తమ నాయకులు కేసీఆర్‌తో రాజీ పడినందుకే తాము బయటకొచ్చామని ప్రకటిస్తున్నారు. వీరంతా కలిసినప్పటికీ దాదాపు ఒంటరిగా మెజార్టి సాధించేంత వూపుకాంగ్రెస్‌కు వుందా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే.
సీపీఐ(ఎం) కీలక ప్రభావం
బీజేపీని ఓడించడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేకత విధానాలపై పోరాడటానికి 19 స్థానా ల్లో స్వంతంగా రంగంలోకి దిగిన సీపీఐ(ఎం) పోటీలు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఫలితాలను కీలకంగా ప్రభా వితం చేస్తాయి. కాంగ్రెస్ ఆశలు పెట్టుకున్న జిల్లాల్లో ఇవే ప్రధానమైనవి కావడం గమనించదగ్గది. హైదరా బాద్ చుట్టుపక్కల 24 స్థానాలు, ఉత్తరతెలంగాణలో 32సీట్లు కాంగ్రెస్ ఆధిక్యత తెచ్చుకోగలననుకుంటు న్నది. అయితే హైదరాబాదులో మజ్లిస్, బీఆర్‌ఎస్, ఉత్తరాంధ్రలో బీజేపీ బలమైన అభ్యర్థులను నిలపడం వల్ల ఆ ఆశ పూర్తిగా నెరవేరుతుందని చెప్పలేము. మూడు శిబిరాల మధ్య స్వతంత్ర పాత్ర కాపాడుకుం టూ ఆత్మగౌరవం విధాన స్పష్టతతో ముందుకు పోవ డం సీపీఐ పోటీచేసే కొత్తగూడెంలో వారికే మద్దతు నిస్తామని కూడా సీపీఐ(ఎం) చెప్పడం లౌకికశక్తుల వామపక్ష వాదుల మన్ననపొందుతున్నది. కాగా ఇదేదో బీఆర్‌ఎస్ కోసం చేస్తున్నట్టు వచ్చిన ఒక వర్గం మీడి యా చేసిన ప్రచారాన్ని సీపీఐ(ఎం) గట్టిగానే ఖండిం చింది. ఈ పరిస్థితికి కారణమైన బీఆర్‌ఎస,్ కాంగ్రెస్‌లు ఆయా చోట్ల ఓట్ల చీలిక పర్యవసానాలకు మూల్యం చెల్లించవలసి వుంటుంది. బీఎస్పీ కూడా రంగంలో వుంది. కొల్లాపూర్‌లో నిరుద్యోగ యువతి బర్రెలక్క పోటీ మరో ప్రత్యేకతగా వుంది. వీటన్నిటిపై ఓటర్లు ఎలా స్పందిస్తారో డిసెంబర్ మూడున కానీ తేలదు.
ఒంటెత్తు పోకడల మూల్యం?
దక్షిణ భారతంలో ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి మూడోసారి వరుసగా గెలిచింది లేదనే మాట వినిపి స్తున్నా వాస్తవం కాదు. తమిళనాడులో ఎంజి రామ చంద్రన్ 1977, 1980, 1984 ఎన్నికలలో వరుసగా గెలుపొందారు. కేరళలో పినరాయి విజయన్ చరిత్రను మారుస్తూ రెండవసారి ముఖ్యమంత్రి కాగలిగారు. కనుక కేవలం గత ఉదాహరణలతోనే నిర్ణయాలకు రావడం వాస్తవికత కాదు. కేసీఆర్ ప్రభుత్వంపై అనేక విమర్శలు, తప్పొప్పులు వున్నా ఆయనను గద్దెదించా లనీ, కాంగ్రెస్‌కు అవకాశమివ్వాలని ప్రజలు దృఢ నిర్ణ యంతో వున్నారా అనేదానిపై రెండు రకాల వాదనలు కొనసాగుతూనే వున్నాయి. నిజానికి 1983లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాత ఇప్పటివరకూ ఉమ్మడిగా విడిగా తొమ్మిది ఎన్నికలు జరిగితే అందులో మూడు సార్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. 2004 ఎన్నికలు విద్యుత్ ఉద్యమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వామపక్షా లతో కలసి పోరాడిన నేపథ్యం. అదే కేంద్రంలో యుపిఎ రావడానికి దోహదం చేసింది. ఈ వాస్తవా లను విస్మరించిన కాంగ్రెస్ ఒంటెత్తు పోకడ ఎలాంటి ఫలితాలకు దారితీసేది చూడవలసిందే.అలాగే తెలం గాణ సెంటిమెంటు, తమ సంక్షేమ పథకాలు, హైదరా బాద్ అభివృద్ధి, దిగుబడి పెరుగుదల వంటివాటితో పాటు ప్రజలు సారు కారునే విశ్వసిస్తారన్న బీఆర్‌ఎస్ ఆఖరి ఆశలు ఫలిస్తాయా? బీజేపీ పేరాశలను పథకా లను ప్రజలు ఇప్పటికే విఫలం చేసినప్పటికీ ఎవరికీ మెజార్టీ రాని పరిస్థితే వస్తే ఏదో రూపంలో బీజేపీ పట్టు బిగుస్తుందా అనేది కూడా ఫలితాలతో తేలాలి, ఎందుకంటే హంగ్ వస్తే బీజేపీ మాటే చెల్లుతుంద న్నది సర్వజనభావన, ఇప్పటివరకూ తెలుగు ప్రజలు అనిశ్చిత తీర్పులు ఇచ్చిన దాఖలాలు లేవు, మరి ఆ ఒరవడే 2023లోనూ పునరావృతమవుతుందా?
తెలకపల్లి రవి