విజయ్ ఆంటోని, ప్రీతీ అస్రానీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా‘నాన్న కుట్టి’. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని సమర్పణలో ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మాణంలో ము. మారన్ తెరకెక్కించారు. ఈ సినిమాకి సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాత. ఈ మూవీని ఈనెల 27న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేశారు. విజయ్ ఆంటోని మాట్లాడుతూ, ‘సినిమా అద్భు తంగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ బేస్లా ఉంటుంది. సెకండాఫ్ ఎమోషనల్గా ఉంటుంది. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. లిథాన్య పాత్రతో అందరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది. మా మూవీని తెలుగులో విడుదల చేస్తున్న సురేష్ బాబుకి చాలా చాలా థాంక్స్’ అని అన్నారు. ‘ఈ చిత్రాన్ని మగవాళ్లందరికీ అంకితం చేస్తు న్నాను. పదేళ్ల వయసుకి నాన్న అంటే ఏంటో అర్థం కాదు.. 20, 30 ఇలా వయసు పెరుగుతూ ఉంటే.. నాన్న గొప్పదనం అందరికీ అర్థం అవుతుంది. చిన్నతనంలోనే మా నాన్న మా అందరినీ వదిలి వెళ్లిపోయాడు. అందరూ గొప్ప తండ్రులు, అన్న దమ్ముల్లుగా వ్యవహరించండి. తల్లిదండ్రుల్ని కలిగి ఉన్న వారే ఈ ప్రపంచంలో అధిక ధనవం తులు’ అని నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోని చెప్పారు.







కామెంట్లు (0)