దుల్కర్ సల్మాన్ హీరోగా, డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈనెల 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ, 'దుల్కర్ కెరీర్లో మరో మైల్ స్టోన్ మూవీ అవుతుంది.
ప్రతి అమ్మాయి కల నెరవేరాలనేది ఇందులోని ప్రధాన అంశం. చాలా బ్యూటిఫుల్ పాయింట్' అని అన్నారు.
‘కచ్చితంగా ఇది నా కెరీర్‌లో ఒక స్పెషల్ సినిమాగా నిలిచిపోతుందని నమ్ముతున్నాను. డైరెక్టర్ పవన్ ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో పనిచేశారు. ఆయనకు కథపై చాలా క్లారిటీ ఉంది. ఈ సినిమా కచ్చితంగా మనమందరం గర్వపడే సినిమా అవుతుందని నమ్ముతున్నాను' అని తెలిపారు.
డైరెక్టర్ పవన్ సాధినేని మాట్లాడుతూ,'ప్రతి ఆడపిల్ల కల సాకారం చేయడానికి సహకరించాలి. కచ్చితంగా ఇది ఒక స్ఫూర్తినిచ్చే సినిమాగా మీరందరూ ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను' అని చెప్పారు.
‘ఆకాశంలో ఒక తార’ స్ఫూర్తినిచ్చే కథ
3 గంటల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)