Magazines

నిజమైన ప్రేమకి ప్రతీక

8 గంటల క్రితం

love
avatar
balaji

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

వెన్నెల సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద దీపక్ నిర్మాతగా శరత్ తెరకెక్కించిన చిత్రం ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’. రజత్ రాఘవ్, కాజల్, హాసిని సుధీర్ హీరో, హీరోయిన్లు గా బేబీ పరిణిత రుద్రరాజు ముఖ్య పాత్రలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో జెమిని సురేష్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో ఫాదర్‌గా చాలా మంచి పాత్ర చేశాను. ఫాదర్‌ అండ్‌ డాటర్‌ ఎమోషన్‌ అందరి హృదయాలకు హత్తుకుంటుంది' అని అన్నారు. ‘నిర్మాత దీపక్‌ అవుట్‌పుట్‌ పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నారు. తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతుంది. ఈ చిత్రంలోని ఎమోషన్‌ అందర్ని భావోద్వేగానికి గురిచేస్తుంది' అని దర్శకుడు శరత్ చెప్పారు. నిర్మాత దీపక్‌ మాట్లాడుతూ,‘ఈ సినిమా ఎంటర్‌టైన్‌ మెంట్‌.. ఎమోషనల్‌గా ఉంటుంది. రియల్‌ లవ్‌ ఏమిటో ఈ సినిమాలో ఉంటుంది. హీరో రజత్‌ ఎఫర్ట్‌కి తగ్గ ఫలితం ఈ సినిమాతో వస్తుంది. తప్పకుండా ఈ సినిమా నిర్మాతగా నాకెంతో గుర్తింపు తెస్తుంది’ అని తెలిపారు. ‘ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదో ఒక తప్పు చేస్తుంటారు. అయితే ఆ తప్పును సరిదిద్దుకుని జీవితంలో ముందుకు సాగినవాడే కంప్లీట్ మ్యాన్‌. ఈ విషయాన్నే దర్శకుడు ఈసినిమా ద్వారా చెప్పాలని ప్రయత్నించాడు’ అని హీరో రజత్‌ రాఘవ్‌ చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్