Magazines

‘ఆకాశం నీవేనా.. అప్సర’

1 గంట క్రితం

Apsara
avatar
balaji

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాత‌లు. డిసెంబర్ 11న సినిమా విడుదలకానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్‌గా .. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో న‌టిస్తున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్‌తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మరింత బజ్‌ను పెంచేందుకు మ్యూజికల్ ప్రమోషన్స్‌ని ప్రారంభించారు.


ఈ క్రమంలోనే ‘అప్సర’ అంటూ సాగే మోస్ట్ ఇల్యూష‌న్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు గ్యానీ ఇచ్చిన బాణీ, గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ పాట‌కు రమేష్ కుమార్ సాహిత్యం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ లిరికల్ వీడియో మాత్రం హీరో, హీరోయిన్ కెమిస్ట్రీని, వారి మధ్య ఉన్న ప్రేమను గొప్పగా చూపించేలా పాట‌ను రూపొందించార‌ని అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమా ఆడియో పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతుంది. అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా మెన్ : ఎదురోలు రాజు, మ్యూజిక్ :గ్యానీ, ఎడిటర్ : అన్వర్ అలీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమేష్ మన్యం, ప్రొడక్షన్ డిజైనర్ :విష్ణు వర్దన్ పుల్లా, యాక్షన్ కొరియోగ్రఫీ :రాజేష్ లంకా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్