వాస్తవ సంఘటనలతో..

2 గంటల క్రితం

events
avatar
balaji

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

ఎస్ఎస్ మూవీ మేకర్స్, కేఎంసీ ప్రొడక్సన్స్ బ్యానర్ల మీద సునీత శంకర్ సమర్పణలో దొబ్బల శంకర్ నిర్మాణంలో, దుర్గం విజయ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘కురేన్‌ ఘాట్’. ఈ చిత్రంలో శ్రీమాన్, సోనాక్షి జంటగా నటించారు. ఈ మూవీ టీజర్‌ని ఆదివారం లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో.. డైరెక్టర్ దుర్గం విజయ్ కుమార్ మాట్లాడుతూ,‘యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించాం. కొత్త వాళ్లందరం కలిసి చేసిన ఈ చిత్రం బాగా వచ్చింది. క్రైమ్ జానర్‌లో తీసినా.. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో మూవీని రూపొందించాం’ అని అన్నారు. ‘ఈ సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. విజయ్ సినిమాని గొప్పగా తెరకెక్కించారు. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని నిర్మాత దొబ్బల శంకర్ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ వేణు మాట్లాడుతూ,‘ఈ చిత్రంలోని కథ చాలా కొత్తగా ఉంటుంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత శంకర్, డైరెక్టర్ విజయ్కి థాంక్స్. మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్