ఖుషీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై విహాన్ కార్తీక్ హీరోగా ఎంజే నాయుడు దర్శకత్వం వహిస్తూ, నిర్మించిన చిత్రం 'కెరూబ్'. గత, వర్తమాన, భవిష్యత్తు అనేవి ట్యాగ్ లైన్స్. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దర్శకుడు సముద్ర మాట్లాడుతూ,'టీజర్, ట్రైలర్ చూడగానే.. మన ఫారెస్ట్ లో చేసిన అవతార్ లాగా అనిపించింది. మన తెలంగాణ లో ఇంత అందమైన అడవుకున్నాయా అనిపించింది. మరో రామాయణం అంత హిట్ కావాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు. దర్శకుడు, నిర్మాత ఎంజే నాయుడు మాట్లాడుతూ,'నాకు చాలా ఎమోషనల్ గా ఉంది. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా వాటితో సంబంధం లేదు అనిపిస్తోంది ఈ స్టేజ్ వరకు రావటంతో. కుటుంబం సపోర్ట్ తో ఈ సినిమా చేయగలిగాను. సినిమాటోగ్రాఫర్ అద్భుతమైన విజువల్స్ అందించారు. ఆర్ట్ డైరెక్టర్ కూడా ఏది కావాలన్న అప్పటికప్పుడు చేసి ఇచ్చేవాడు. లిరిక్ రైటర్ అలరాజు నాకు ఎలా కావాలి అంటే అలా ఇచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నా ఫ్రెండ్, తమ్ముడు లాంటి హీరో విహాన్ సపోర్ట్ ఎంతో ఉంది. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుతున్నా' అని తెలిపారు.







కామెంట్‌లు (0)