అరవింద్, అర్చన అయ్యర్, హారిక నారాయణ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘నీరో’. గోల్డ్ మౌంటెన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ బ్యానర్ పై అనురాగ్ పర్వతనేని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ కల్యాణ చక్రవర్తి త్రిపురనేని రూపొందిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ,‘నా దగ్గర ట్రైనింగ్ అయ్యి, నాతో ఎన్నో మూవీస్ కు వర్క్ చేసిన నా టీమ్ వ్యక్తి కల్యాణ్ డైరెక్టర్ అయ్యాడు అని చెప్పేందుకు ఈ ఈవెంట్ కు వచ్చాను. ఈ సినిమాకు వర్క్ చేసిన రాంప్రసాద్ , ఓషో వెంకట్..ఇలా చాలా మంది నాతో జర్నీ చేసిన వాళ్లే. గ్లింప్స్ చూస్తే సినిమాలో ఏది ఎంత ఉండాలో అంత ఉంది. అరవింద్ పర్ ఫార్మెన్స్ లో ఇంపాక్ట్ ఉంది.
ఆడియెన్స్ ను కట్టిపడేసే ఎక్స్ ప్రెషన్స్ చూపించారు. నీరోతో ఒక మంచి హీరో వచ్చాడనే పేరు అరవింద్ కు, ఆ హీరోను తీసుకొచ్చాడనే పేరు కల్యాణ చక్రవర్తికి రావాలి. అనురాగ్ ఈ సినిమాకు చేసిన ప్రొడక్షన్ వ్యాల్యూస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక పాటనే అంత అందంగా అర్థవంతంగా రాసే కల్యాణ చక్రవర్తి...రెండు గంటలు పైగా నిడివి ఉండే సినిమాను ఎంత బాగా చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఆ రిజల్ట్ మనం థియేటర్స్ లో చూస్తాం’ అని అన్నారు. డైరెక్టర్ కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ,‘ఈ కథను నేను అనురాగ్ కి చెప్పాను. ఆయన కథ విన్న వెంటనే చాలా ఎగ్జైట్ అయ్యారు. ఇది ప్రేమను నిలబెట్టేందుకు జరిగే ఒక విధ్వంసం’ అని తెలిపారు.







కామెంట్లు (0)