Magazines

ఘనంగా హీరో తేజ సజ్జ నిశ్చితార్థం

3 గంటల క్రితం

Teja Sajja
avatar
balaji

ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం

హీరో తేజ సజ్జా, మౌర్య నిశ్చితార్థం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, రాజకీయ ప్రముఖులు, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్ సమక్షంలో సోమవారం గ్రాండ్ గా జరిగింది. చిరంజీవి, తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి సీతక్క, హరీశ్ రావు, గంటా శ్రీనివాసరావు తదితర ప్రముఖులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, టీజీ విశ్వప్రసాద్, సుస్మిత కొణిదెల, సాహు గారపాటి, వెంకట్ బోయనపల్లి, నటులు శ్రీకాంత్, రవితేజ, నాని, రానా దగ్గుబాటి, అడివి శేష్, సుధీర్ బాబు, వరలక్ష్మి శరత్ కుమార్, నిధి అగర్వాల్, నిహారిక కొణిదెల, రితికా నాయక్, ఇమాన్వి ఈ వేడుకలో పాల్గొన్నారు. డిసెంబర్‌లో డెస్టినేషన్ వివాహం జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్