Magazines

వినూత్న కాన్సెప్ట్‌

9 గంటల క్రితం

Innovative
avatar
balaji

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

రమేష్ జక్కల దర్శకత్వంలో ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మాతగా ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘యద్భావం తద్భవతి’. వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇనయ సుల్తానా, రేణు శ్రీ హీరోయిన్స్. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సందర్భం గా టీజర్‌ని నిర్మాత లగడపాటి శ్రీధర్ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మించిన ఈ చిత్ర టీజర్ చూస్తుంటే చిన్న సినిమా అయినప్పటికీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నట్లు అనిపిస్తుంది.

అలాగే ఒక పాట కూడా చూశాను. రమేష్ జక్కల దర్శకత్వం, మిహిరామ్ సంగీతం చాలా బాగున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కళ పట్ల ఉన్న అభిమానంతో సినిమా తీయడం చాలా పెద్ద విషయం. వరుణ్ సందేశ్ అలాగే ఇతర నటీనటులకు చిత్ర బృందానికి నా అభినందనలు. ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి, నిర్మాత మరో సినిమా తీసేలా ఆశీర్వదించాలి’ అని అన్నారు. ఈ చిత్రంలోని పాటలను కే మ్యూజిక్ ద్వారా చిత్ర బృందం విడుదల చేయనుంది. రేణు శ్రీ, సుమన్, నాగ మహేష్, లోహిత్ కుమార్, ధనరాజ్, శ్వేత వర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు నటిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్