సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే, సావిత్రి బాయి ఫూలే జీవితాల ఆధారంగా రూపొందిన సినిమా ‘ఫూలే’. దర్శకుడు అనంత్ మహదేవన్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది. ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ప్రతీక్ గాంధీ మహాత్మా జ్యోతిరావ్ ఫూలే పాత్రలో, పత్రలేఖ సావిత్రిబాయి ఫూలే పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సుపదా క్రియేషన్స్ నిర్మించింది. డా. పొన్నం రవిచంద్ర నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదల నేపథ్యంలో మంగళవారం ఫిల్మ్ చాంబర్లో చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది.
దీనికి సోషల్ యాక్టివిస్ట్ విమలక్క, టీఎఫ్‌సీసీ చైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, రచయిత పసునూరి రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నిర్మాత డా. పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ, ‘ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఈనెల 27న ఎన్ని సినిమాలు విడుదలైనా, ‘ఫూలే’ ఒక విభిన్నమైన జోనర్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సుమారు 200 ఏళ్ల క్రితం జరిగిన చరిత్రను నేటి ప్రజలు, ముఖ్యంగా మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’ అని తెలిపారు. ‘ఈ రోజు ఆడపిల్లలు ఎన్నో రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారంటే అందుకు సావిత్రిబాయి ఫూలే వేసిన పునాదులు ఎంతో ముఖ్యమైనవి. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతారు’ అని సోషల్ యాక్టివిస్ట్ విమలక్క చెప్పారు.
తరతరాలకు స్ఫూర్తి...
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)