అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న నూతన సినిమా‘కాకా’. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసింది. మరోవైపు, సినిమా రిలీజ్ డేట్‌పై వస్తున్న ఊహాగానాలకు చిరంజీవి స్వయంగా చెక్ పెట్టారు. ముందుగా ప్రకటించినట్టుగానే ‘కాకా’ 2027 జనవరి 13న థియేటర్లలోకి రానుందని స్పష్టం చేశారు.
సంక్రాంతి రిలీజ్‌ను మరోసారి ధృవీకరిస్తూ మెగాస్టార్ స్టైలిష్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు ఉండదని అభిమానులకు, సినీ ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ప్రకటించినట్టుగా సినిమా ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు.
చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్లో కొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. “ఆటో జానీ గుర్తున్నాడా? ఈ సంక్రాంతికి సరికొత్తగా కాకాగా మీ ముందుకు వస్తున్నాడు. ఈ సంక్రాంతికి ‘ఆటో జానీ’గా సరికొత్త కోణంలో మీ అందరినీ ఎంటర్‌టైన్ చేయడానికి ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాని ఒక మెమరబుల్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌గా మార్చేందుకు బాబీ, చిత్రబృందం ఎంతో కష్టపడుతున్నారు. 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో కలుద్దాం. సంక్రాంతికి కలుద్దాం అని పోస్ట్ చేశారు. చిరంజీవి, అనస్వర రాజన్, నివేతా థామస్, అనురాగ్ కశ్యప్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి రచన, దర్శకత్వం: బాబీ కొల్లి, నిర్మాత: వెంకట్ కె. నారాయణ, సంగీతం: థమన్ ఎస్, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి, అడిషనల్ స్క్రీన్‌ప్లే: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి, సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్: ఆంటోనీ రూబెన్, ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా.







కామెంట్‌లు (0)