Magazines

న్యూ ఇయర్‌ కానుకగా విడుదల

1 గంట క్రితం

Released
avatar
balaji

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

ఫహాద్ ఫాజిల్ హీరోగా వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్ నిర్మిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అసరీరి’. ఈ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న 32వ చిత్రమిది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, మాన్‌సూన్ మూవీస్ అసోసి యేష‌న్‌లో నిర్మిస్తున్నారు. సి. ప్రేమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 1 నూతన సంవ‌త్స‌ర‌ కానుకగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున‌ విడుదల చేయటానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. డాక్టర్ ఇషారి కె. గణేష్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు వైవిధ్యమైన, భారీ ప్రాజెక్టులను ప్రేక్షకులకు అందించే వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్..ఇప్పుడు ‘అసరీరి’ సినిమాతో తమ సినీ జ‌ర్నీలో మరో కీలక మైలురాయిని అందుకోవడానికి సిద్ధమవుతోంది. ‘96’, ‘స‌త్యం సుంద‌రం’ (మెయ్య‌ళ‌గ‌న్‌) వంటి సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.


విభిన్నమైన కథలు, విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫహాద్ ఫాజిల్ ఈ ఆసక్తికరమైన థ్రిల్లర్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో శివద, చేతన్, గీత, హరీష్ ఉత్తమన్, కరుణాకరన్, శరణ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు సి.ప్రేమ్ కుమార్, సంగీత దర్శకుడు గోవింద్ వసంత కలిసి పనిచేస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘96’, ‘సత్యం సుందరం’ (మెయ్యళగన్) సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు ‘అసరీరి’తో మరోసారి ఈ కాంబో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు మహేంద్రన్ జయరాజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, గోవింద్ వసంత సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఆర్. గోవిందరాజ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు మహేష్ మాథ్యూ స్టంట్స్ కంపోజ్ చేస్తుండగా, కుమార్ గంగప్పన్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్