సత్యారెడ్డి డైరెక్షన్ లో రెండు సంవత్సరాల క్రితం అమెరికాలో ప్రారంభించి, అనేక బౌద్ధ దేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న మూవీ ‘కింగ్ బుద్ధ’. ఈ సినిమా పోస్టర్ ను ఏఐసీసీ ప్రెసిడెంట్, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో ప్రముఖ బౌద్ధ బిక్షుల సమక్షంలో ఘనంగా లాంచ్ చేశారు. ఒక భారతీయుడు ముఖ్యంగా ఒక తెలుగువాడు కింగ్ బుద్ధ పేరుతో గౌతమ్ బుద్ధుని చరిత్రను హాలీవుడ్ లో నిర్మించి, ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటం చాలా సంతోషమని మేకర్స్‌కి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఇప్పటివరకు పూర్తయిన కింగ్ బుద్ధ చిత్రాన్ని స్వయంగా వీక్షించిన మల్లికార్జున కార్గే ఈ చిత్రంలోని సన్నివేశాల గురించి, క్యారెక్టర్ల గురించి, చిత్ర నిర్మాణం గురించి కొన్ని సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, గౌతమ్ బుద్ధ పాత్రధారి సత్యారెడ్డి మాట్లాడుతూ, ‘నా దర్శకత్వం లోని కింగ్ బుద్ధ ఇండియన్ లాంగ్వేజ్ పోస్టర్లను లాంచ్ చేయటంతోపాటు మల్లికార్జున ఖర్గే కొన్ని సూచనలు చేశారు. బౌద్ధ ధర్మం మీద ఆయనకు చాలా అవగాహన ఉంది. కర్ణాటక రాష్ట్రంతో పాటు గుల్బర్గా ప్రాంతంలో బుద్ధిజాన్ని అభివృద్ధి చేశారు. ఆయన సూచనలు తప్పకుండా పాటిస్తాము. వచ్చే సంవత్సరం బుద్ధ జయంతికి ప్రపంచవ్యాప్తంగా 100 భాషలకు పైగా ఎక్కువ దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాము. త్వరలో టీజర్ ను ఆసియా ఖండంలోని ఒక దేశ ప్రధాని చేతులమీదుగా అనేక బుద్ధిష్టు దేశ విదేశాలకు చెందిన బౌద్ధ బిక్షువుల సమక్షంలో విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు.







కామెంట్లు (0)