Magazines

మీ బాల్యాన్ని గుర్తు చేస్తుంది...

10 గంటల క్రితం

childhood
avatar
balaji

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ‘సమ్మర్ హాలిడేస్’ అనే చిల్డ్రన్ మూవీని నిర్మించారు. శ్రీకర్ దర్శకుడు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటించారు. నేడు (శుక్రవారం) ఈ ప్రేక్ష‍కుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం మాస్టర్‌ రోహన్, అరుణ్ మీడియాతో చిత్ర విశేషాలను షేర్‌ చేసుకున్నారు. మాస్టర్‌ అరుణ్ మాట్లాడుతూ, ‘ఇందులో ఆర్.వి. అనే రోల్ చేశాను. ఈ పాత్ర చాలా కామ్ గా ఉంటుంది. లైఫ్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ అతని లైఫ్ లో సంతోషం ఉండదు. అలా కామ్ గా ఉండే అబ్బాయిలో కె.వి.తో పరిచయం అయ్యాక ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది సినిమాలో చూస్తారు.

జయసుధ లాంటి పెద్ద నటితో నటించడం గౌరవంగా భావిస్తున్నా. నటుడిగా స్టేట్, నేషనల్ అవార్డ్స్ పొందా నంటే కారణం మా అమ్మ. సినిమాలు చేసే క్రమంలో ఎక్కడైనా నిరాశపడితే అమ్మే ఎంతో ధైర్యం నింపేది. ఆమె మాటలు నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి’ అని అన్నారు. ‘ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు కె. వి. అతనికి లైఫ్ లో ఎన్నో అవమానాలు ఎదురైనా అందరితో నవ్వుతూ మాట్లాడుతుంటాడు. తన కుటుంబం కోసం, అమ్మ కోసం కష్టపడుతుంటాడు. నేను చేసిన చిత్రాల్లో చదువు అబ్బని పాత్రలే ఎక్కువ ఉన్నాయి. నైన్టీస్‌, ప్రీ వెడ్డింగ్ షో, సమ్మర్ హాలిడేస్ ఈ మూడు సినిమాల్లో మంచి ఫన్ అందించే రోల్స్ నాకు దక్కడం సంతోషంగా ఉంది’ అని మాస్టర్‌ రోహన్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్