Magazines

చెడుపై గెలిచే ‘భోగి’

1 గంట క్రితం

Bhogi
avatar
balaji

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

హీరో శర్వా నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఈనెల 27న విడుదల కానున్న సందర్భంగా దర్శకుడు సంపత్ నంది మీడియాతో ముచ్చటించారు. ‘భోగి’ మొదలవడానికి నా చైల్డ్‌ హుడ్ మెమోరీస్ ఒక కారణం. మా ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో రామగిరి గుట్ట అని ఒక చోటు ఉండేది. అక్కడ ఒక పర్టిక్యులర్ వ్యక్తి గురించి చాలా విషయాలు చెప్పేవారు. ఆ గుట్ట దగ్గర మూఢ శక్తుల కోసం ఒక వ్యక్తి ఏదో చేస్తున్నాడని అనేవారు. ఆ వ్యక్తి వస్తే మేమంతా చిన్న పిల్లలం పరిగెత్తే వాళ్లం. ఆ వ్యక్తి ఎందుకు వచ్చే వాడు? మేమంతా ఎందుకు పరిగెత్తే వాళ్లం? అనేది నేను ఇప్పుడే చెప్పను. కాకపోతే ఆ ఇన్సిడెంట్ నా మనసులో నిలిచి పోయింది.


కమర్షి యల్‌గా ఒక సినిమా చేద్దామను కున్నప్పుడు, ఇలా రూటెడ్‌గా ఒక కథ చేయాలని అనిపించింది. ఇది అందరూ చూడగలిగే సినిమా. ఒక మాస్ యాక్షన్, విలేజ్ రూటెడ్ కథ చేశాం. ఇప్పటి వరకు శర్వా నంద్ ఇలాంటి సినిమా చేయలేదు. ఆయన ఈ సినిమాను చూసి చాలా అప్రిషియేట్ చేశారు. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టు కున్నానని అనిపించింది. ఈ సినిమా కోసం 15 ఎకరాల్లో బొగ్గుల గుట్ట విలేజ్ సెట్ నిర్మించాం. అయితే ఇది నిజమైన విలేజే అనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఇది సంక్రాంతికి ముందు వచ్చే భోగి కాదు. పాత విషయాల్ని, చెడును పాతరేసి, చంపిన తర్వాత వచ్చిన భోగి. ఆ ఊరు కొన్ని విషయాలను నమ్మింది. అవి కరెక్ట్ కాదని ప్రూవ్ చేయడమే కథా నాయకుడి లక్ష్యం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్