‘శ్రీమతి’ విజయం ఖాయం

2 గంటల క్రితం

Srimati
avatar
balaji

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

జీ5 ఒరిజిన‌ల్ మూవీగా ‘శ్రీమతి’లో నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ను పోషించగా.. తిరువీర్‌, హ‌రితేజ‌, రేణూ దేశాయ్‌, గోప‌రాజు ర‌మ‌ణ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. విశ్వ‌క్ ఖండేరావు ద‌ర్శ‌క‌త్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 4న ఈ మూవీని జీ5లో స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజశేఖర్, జీవిత ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రాజ శేఖర్ మాట్లాడుతూ,‘‘శ్రీమతి’ టైటిల్ వినగానే ఇదొక మంచి చిత్రం అవుతుందని నాకు అనిపించింది. ఇందులో మంచి కథ, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నచ్చేలా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’ అని తెలిపారు.

‘ఈ మధ్య కాలంలో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’, ‘ఆకాశంలో ఒక తార’.. ఇప్పుడు రాబోతోన్న ‘శ్రీమతి’ మూవీని అందరూ తప్పకుండా చూడాలి. తల్లిదండ్రులు ఎలా ఉండాలి.. పిల్లలు ఎలా ఉండాలి.. భార్యాభర్తలు ఎలా ఉండాలి.. అనేది చూపించేలా సినిమాలు వచ్చాయి. ‘శ్రీమతి’ లాంటి చిత్రాలు ఇంకా రావాలి’ అని జీవిత రాజశేఖర్ అన్నారు. నివేదా థామస్ మాట్లాడుతూ,‘ఈ కథ నా మనసుకి ఎంతో నచ్చింది. పెళ్లి తర్వాత అమ్మాయి జీవితం పూర్తిగా మారుతుంది. నా కెరీర్‌లో ఇదొక విలువైన చిత్రం. ఇందులో నటించడం నా అదృష్టం. మగాడికి వ్యతిరేకంగా కాదు.. మన సిస్టంకి వ్యతిరేకంగా తీసిన సినిమా’ అని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్