హీరో నాని తన యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘అలియాస్ రుక్మిణి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తు న్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో హీరో నితిన్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా ఎంత బాగుంటుందో మీరే సినిమా చూశాక చెప్పండి. ఒక నటుడిగా గత రెండేళ్లుగా చాలా ఒత్తిడిలో ఉన్నాను. సరైన సినిమాలు, కథలు రావడం లేదు. కొన్ని నిద్రలేని రాత్రులు కూడా గడిపాను. ఈ కథ విన్న తర్వాత ఆ రోజు నుంచి హాయిగా నిద్రపోయాను. ఈరోజు వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్నాను.
ఈ సినిమా ఎలాంటి కథలు చేయాలనే విషయంలో నా దృష్టికోణాన్ని మార్చింది’ అని తెలిపారు. ‘మా అందరికీ ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. ఒక నిర్మాతగా ఈ సినిమా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. కంటెంట్ విషయంలో చాలా తృప్తిగా ఉంది. రిలీజ్ ముందు ఎలాంటి టెన్షన్ లేదు. మీ అందరితో కలిసి ఈ సినిమా చూడటానికి ఎదురుచూస్తున్నాను. డిసెంబర్ 3వ తేదీ రాత్రి ప్రీమియర్స్ ఉంటాయి. అక్కడి నుంచి సెలబ్రేషన్స్ మొదలుకాబోతున్నాయి. మురళి ఫెంటాస్టిక్ రైటర్, డైరెక్టర్. తనకంటూ ఒక ఒరిజినల్ వాయిస్ ఉంది. నేను కథ విన్నప్పుడు సినిమా ఎంత బాగుంటుందో అనుకున్నాను. దానికంటే మరింత బ్యూటిఫుల్‌గా సినిమా తీసిచ్చాడు’ అని హీరో నాని చెప్పారు.







కామెంట్లు (0)