సర్వే నంబర్ 629 లో ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలి

– ఎం ఆర్ పి ఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు రేణిగుంట్ల సాగర్
– ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ జమ్మికుంట
జమ్మికుంట పట్టణంలోని 629 లో గల6 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమంగా ఆక్రమించుకున్నారని వారి నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలని ఎమ్మార్పీఎస్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు రేణిగుంట్ల సాగర్ అన్నారు. గురువారం స్థానిక గాంధీ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా ,ఆందోళన, నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడారు. నివేషన స్థలాలు లేని నిరుపేదలు కనీసం 60 గజాల స్థలాన్ని కావాలని ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతూ, దరఖాస్తులు పెట్టినప్పటికీ స్పందించని ప్రభుత్వ అధికారులు,ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నప్పటికీ స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. వెంటనే ప్రభుత్వ అధికారులు కబ్జాకు గురైన ఆరు ఎకరాల భూమిని అర్హులైన నిరుపేదలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల  ఈ ఉద్యమాన్ని ఎమ్మార్పీఎస్ ,దళిత సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి రాష్ట్ర నాయకులు మార పెల్లి శ్రీనివాస్ మాదిగ, పర్ల పెల్లి తిరుపతి మాదిగ, ఖండే మహేందర్ మాదిగ, జూపాక సమ్మయ్య మాదిగ, శివ మాదిగ, మైస సాంబయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love