– లీనా నందన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వ్యర్థాల పునర్వినియోగంలో మరింత నైపుణ్యత పెరగాల్సిన అవసరముందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి లీనా నందన్ సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వ్యర్థాల పునర్వినియోగంపై నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నైపుణ్యత పెరగడంతో ద్వారా వ్యర్థాల పునర్వినియోగం పెరిగి ఆర్థికంగాను బలపడుతామని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో చైతన్యం పెంచే కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. వ్యర్థాల పునర్వినియోగ రంగంలో మరిన్ని పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. పర్యావరణశాఖ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీ-ఐడియా కార్యక్రమం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రమ మండలి సభ్య కార్యదర్శి జి.రవి, సీనియర్ సోషల్ సైంటిస్ట్ డాక్టర్ డబ్ల్యూ.జి.ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.