– గ్రాడ్యుయేట్స్ 2175, టీచర్స్ 66 మంది ఓటర్లు
నవతెలంగాణ – రాయికల్
పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్,టీచర్ల ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్లు 2,175 మంది,టీచర్లు 66 మంది మొత్తం 2,241 మంది ఓటర్లకు 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్ నెంబర్ 220 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర) లో పురుషులు 429, మహిళలు 280, పోలింగ్ స్టేషన్ నెంబర్ 221 లో పురుషులు 441 మంది, మహిళలు 260 మంది ఓటర్లు కాగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం లో ఒకే గదిలో గ్రాడ్యుయేట్లకు పోలింగ్ స్టేషన్ నెంబర్ 222 లో పురుషులు 463, మహిళలు 302 టీచర్లకు సంబంధించి పోలింగ్ స్టేషన్ నెంబర్ 140లో పురుషులు 49, మహిళలు 17 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.