సామాజిక న్యాయ ఎజెండాను అమలు చేయాలి: పి.శంకర్

నవతెలంగాణ – మిరుదొడ్డి
భారత రాజ్యాంగ స్ఫూర్తి కి అనుగుణంగా జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలో అసమానతల రూపు మాపడానికి సామాజిక న్యాయ ఎజెండాను అమలు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేసారు. డిబిఎఫ్ అధ్వర్యంలో చెపట్టిన భారత రాజ్యాంగ ప్రచారోద్యమంలో భాగంగా అదివారం నాడు గజ్వేల్ అంబేద్కర్ భవన్ లో కేంద్ర ఎన్నికలు దళితుల అకాంక్షలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మార్చుతమని ప్రకటిస్తు ,రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్దంగా  ఇడబ్ల్యు ఎస్ రిజర్వేషన్ లను అగ్రకులాలకు అమలు చేస్తు ,ఎస్సీ, ఎస్టీ, బిసి,మైనారిటీ ల హక్కులను కాల రాస్తున బిజెపి ని ఓడించాలన్నారు.  కుల గణన చేయడం లేదన్నారు. దేశ వ్యాప్త ఎస్సీ,ఎస్టి సబ్ ప్లాన్ చట్టం చేయాలన్నారు.గత పదేళ్ళుగా కేంద్ర బడ్జెట్ లో దళితుల సమగ్ర అభివృద్ధి కి నిధులు కేటాయించలేదని,స్కాలర్ షిప్ లను ఎత్తివేసెందుకు కుట్ర చెసిందన్నారు. విద్యా,వైద్యాన్ని ప్రవేటికరణ నుండి కాపాడి 20 శాతం చొప్పున నిధులు కేటాయించాలన్నారు.జాతీయ గ్రామిణ ఉపాధి హమి పధకానికి నిధులు తగ్గిస్తు కార్మిక వ్యతిరేక విధానాలను బిజెపి అవలంభించిందన్నారు.ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని సక్రమంగా అమలు చెయాలని,41 సిఅర్ పి రద్దు చేసి నిందుతులను కఢినంగా శిక్షించాలన్నారు.భూసంస్కరణలను అమలు చేసి భూమి లేని పేదలకు హక్కు గా భూపంపిణి చేయాలన్నారు. పేదలకు పక్కా గృహలను నిర్మించి ఇవ్వాలని,నిరుద్యోగులకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామి,మానవ హక్కుల వేదిక నాయకులు మల్లేశం, వివిధ సంఘాల నాయకులు పి.ఎల్లయ్య,కాశీం,బాస్కర చారి ,సత్తయ్య,కనకప్రసాద్,రాజు,చంద్రయ్య ,న్యాయవాది బత్తుల రాజు ,ఎల్లం తదితరులు పాల్గొన్నారు.
Spread the love