నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రం లోని ఎస్సీ బాలుర వసతి గృహం లో షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవు, గార్ల వర్ధంతి కార్యక్రమాన్ని జుక్కల్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎప్ఐ జిల్లా అధ్యక్షులు ఎస్ అజయ్ కుమార్, మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, యువన వయసులో ఉన్నప్పుడు భగత్ సింగ్ గారు భారతదేశ స్వతంత్రం కోసం ఆలోచించి పోరాటాలు ఉద్యమాలు చేయడం జరిగింది, ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడే భారతదేశ ప్రజాస్వామ్యం లేదని తల్లితండ్రులు యొక్క అడుగుజాడలో కొనసాగుతూ దేశ ప్రజలందరికీ స్వతంత్రం అవసరం అని భావించి 23 ఏళ్ల సంవత్సరాల వరకు భారతదేశం కోసం పోరాటాలు ఉద్యమాలు చేయడం జరిగింది . ఆ పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వం మహావీరులైన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవు,గార్లకి ఉరిశిక్ష విధించి పోరాట యోధులను ఈ లోకంలో లేకుండా చేశారు. నేటి యువతరం భగత్ సింగ్ గారిని ఆదర్శం తీసుకొని యువతరం ముందుకు కొనసాగాలని భారత విద్యార్థి ఫెడరేషన్ SFI కోరుతుంది. నేటి యువతరం డ్రగ్స్,గంజాయి, ఆన్లైన్ గేమ్స్, అంటూ యువతరం చెడు అలవాటులకు గురవుతున్నారు కనీసం పాఠ్యపుస్తకాల్లో మహావీరులైన భారత ప్రజాస్వామ్ వైపు మోగ్గు చూపాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కృషి ఇప్పుడు మీ ద్వారా ఇంకా అనేక విద్యార్థుల్లోనికి వేలలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు విలాస్ ఉపాధ్యక్షులు షేక్ ఫిర్దోస్, కమిటీ నాయకులు జమీల్, సిద్ధరం, ప్రముఖ విద్యావంతులు రమేష్ సార్ గారు,విద్యార్థులు పాల్గొన్నారు .