Magazines

కథ చెప్పు

5 రోజుల క్రితం

Tell a story
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

అమ్మా అమ్మా కథ చెప్పు

రాజు రాణిల కథ చెప్పు

రాతి బొమ్మల కథ చెప్పు

ఎగిరే గుర్రం కథ చెప్పు


అమ్మా అమ్మా కథ చెప్పు

కొమ్మా కోయిల కథ చెప్పు

కొండ కోనల కథ చెప్పు

కోతి బావల కథ చెప్పు


అమ్మా అమ్మా కథ చెప్పు

అవ్వా తాతల కథ చెప్పు

నీరు నిప్పుల కథ చెప్పు

చీకటి వెలుగుల కథ చెప్పు

అమ్మా అమ్మా కథచెప్పు

గువ్వా గూడుల కథ చెప్పు

నోటి లెక్కల కథ చెప్పు

చీమల దండు కథ చెప్పు


అమ్మా అమ్మా కథ చెప్పు

చుక్కల లోకపు కథ చెప్పు

వీరుల యోధుల కథ చెప్పు

మాయా మంత్రాల కథ చెప్పు


అమ్మా అమ్మా కథ చెప్పు

అన్నా చెల్లెళ్ల కథ చెప్పు

అల్లరి పిల్లల కథ చెప్పు

అందరూ మెచ్చే కథ చెప్పు

డా.హారిక చెరుకుపల్లి, 9000559913

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్