Magazines

ఆరు ఋతువులు

4 రోజుల క్రితం

The Six Seasons
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

వసంత ఋతువు వచ్చింది

ఋతువుల రాజు నేనంది

పూల గొడుగులు పట్టింది

మామిడి పూతలు వేసింది

గ్రీష్మ ఋతువు వచ్చింది

వేసవి తాపం తానంది

ఎర్రటి ఎండలు తెచ్చింది

తియ్యటి పండ్లను ఇచ్చింది

వర్ష ఋతువు వచ్చింది

వేడికి హాయి నేనంది

వాగు వంక పొంగింది

పచ్చని తివాచి పరిచింది

శరదృతువు వచ్చింది

అందాల కాలం తానంది

వెండి వెన్నెల తెచ్చింది

సీతాఫలాలు ఇచ్చింది

హేమంత ఋతువు వచ్చింది

కోతల కాలం నేనంది

శీత గాలులు తెచ్చింది

మంచు పల్లకిలో తిప్పింది

శిశిర ఋతువు వచ్చింది

ఆరో ఋతువు తానంది

చెట్లకు ఆకులు రాల్చింది

చలితో గిలిగిలి పెట్టింది

డా. హారిక చెరుకుపల్లి,

9000559913

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్