జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన ఎస్పీ

SP who unveiled the flag at the district police officeనవతెలంగాణ – సిరిసిల్ల
జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జాతీయ జెండాను ఎగురవేసి జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి 78 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశం మొత్తం  ఆనందంగా జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, మనం ఒక ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ఎందరో మహానుభావులు కష్ట, నష్టాలకు ఓర్చి వారి విలువైన జీవితాలను, ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను స్మరిస్తూ,ఎంతో మంది త్యాగధనుల పుణ్యఫలం, లెక్కలేనని త్యాగాలు అవిశ్రాంత పోరాటాల తర్వాత వలస పాలన విముక్తి తరువాత స్వాతంత్రం సిద్ధించిందని స్వాతంత్రోద్యమం చరిత్ర, మనకు తెలిసిన మహనీయులు కాకుండా ఎంతోమంది ప్రాణ త్యాగం చేయడం జరిగింది వారి గురించి కూడా పిల్లలకు, కుటుంబం సభ్యులకు భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు.ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ  మన వంతు భాద్యతగా ప్రజాసేవ కొరకు పాటుపడాలని, సిబ్బంది తమ విధులను భాద్యతాయుతంగా నిర్వహించి పోలీస్ శాఖకు  మంచి పేరు ప్రతిష్ట తీసుకురావడానికి కృషి చేయాలని  సూచించారు. పోలీస్ అధికారులు సిబ్బంది వారివారి విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి,సర్వర్, ఆర్.ఐ లు, సి.ఐ లు ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love