జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు..

– రోజుకు 400 బస్సులు చొప్పున 15 డిపో ల ప్రత్యేక డ్రైవ్..
– కరీంనగర్ జోనల్ ఈడి  వినోద్ కుమార్..
నవతెలంగాణ – వేములవాడ
మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై వేములవాడ రాజరాజేశ్వర స్వామి జాతర ఉత్సవాలు పురస్కరించుకొని కరీంనగర్ జోనల్ ఈడి  వినోద్ కుమార్  కరీంనగర్, వరంగల్, నిజామాబాద్,  నిర్మల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినారు. మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చలువ పందిళ్ళు వైట్ పాండా లు, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి భక్తులకు సురక్షిత ప్రయాణం అందించాలని ఆదేశించినారు. జాతర జరుగు 7 తేదీ నుండి 9వ తేదీ వరకు రోజుకు 400 బస్సులు చొప్పున 15 డిపో ల పరిధిలో నడపాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ కరీంనగర్  సుచరిత, డిప్యూటీ ఆర్ ఎం ఓ  భూపతి రెడ్డి, డిప్యూటీ ఆర్ ఎం ఎం  సత్యనారాయణ, ఈడీ సెక్రటరీ  యుగంధర్ రెడ్డి,  డిపో మేనేజర్లు  మనోహర్ , ఆంజనేయులు,   మేనేజర్ మురళీకృష్ణ,  సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love