– ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్
నవతెలంగాణ – సిరిసిల్ల
ధరణిలో దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. ధరణి దరఖాస్తులపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో సిరిసిల్ల, వేములవాడ రెవెన్యూ డివిజనల్ అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల వివరాలను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ల లాగిన్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ఆర్డీఓలకు పంపించాలని, ఆ తర్వాత జిల్లా స్థాయిలో పరిశీలించిన అనంతరం పరిష్కరించడం జరుగుతుందన పేర్కొన్నారు. ఆయా లాగిన్లలో కలిపి మొత్తం 866 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు తెలిపారు. సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ లు రమేష్, రాజేశ్వర్, అన్ని మండలాల తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.