Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవ వినాయకులకు ప్రత్యేక పూజలు

నవ వినాయకులకు ప్రత్యేక పూజలు

- Advertisement -

నవతెలంగాణ-భీంగల్ 
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం జాగీర్యాల్ గ్రామంలో క్రేజీ బాయ్స్ యువజన సంఘం ఆధ్వర్యంలో 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండలంలోని తొలిసారి ఎవరు చేయని విధంగా గణేష్ నవ రూపాల పూజ..

నవరాత్రులలో ఒక్కో రోజు వినాయకుడిని ఒక్కో అవతారంలో పూజించారు.
మొదటి రోజు వినాయకుని వరసిద్ధి వినాయకునిగా పూజించి ఉండ్రాళ్లను సమర్పించారు.
రెండో రోజు వికట వినాయకుని పూజించి అటుకులు నైవేద్యంగా సమర్పించాలి.
మూడో రోజు లంబోదర వినాయకుని పూజించి పేలాలు నైవేద్యంగా సమర్పించాలి.
నాలుగో రోజు గజానన వినాయకుని పూజించి చెరకు గడలు నైవేద్యంగా సమర్పించాలి.
ఐదో రోజు మహోదర వినాయకుని పూజించి కొబ్బరి కురిడిని నైవేద్యంగా సమర్పించాలి.
ఆరో రోజు ఏకదంత వినాయకుని పూజించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి.
ఏడో రోజు వక్రతుండ వినాయకుని పూజించి అరటిపండ్లు, ఇతర పండ్లను నైవేద్యంగా సమర్పించాలి.
ఎనిమిదో రోజు విఘ్నరాజ వినాయకుని పూజించి సత్తుపిండి నైవేద్యంగా సమర్పించాలి.
తొమ్మిదో రోజు ధూమ్రవర్ణ వినాయకుని పూజించి నేతి అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి.
ఇలా తొమ్మిది రోజుల పాటు వినాయకుని తొమ్మిది స్వరూపాలను భక్తిశ్రద్ధలతో పూజించారు. 

 ఇంతే కాకుండా మొదటి రోజు ఆగమన్ వేడుకలు ఘనంగా జరిపించారు. బొజ్జ గణనాధుని కూర్చొని ఉన్న 9 బొజ్జ గణపయ్య విగ్రహాలను 9 ట్రాక్టర్ లపై ఆగమన కార్యక్రమం చేపట్టారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో ‘ఆగమన్’ ఇప్పుడు నయా ట్రెండ్గా మారింది. నిన్నమొన్నటి వరకు భక్తులు గణనాథులను మండపాల్లో ప్రతిష్ఠించి, తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, అనంతరం ఘనంగా నిమజ్జనం చేయడం ఆనవాయితీగా ఉండేది. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ‘ఆగమన్’ (ఆగమనం) పేరుతో దూర ప్రాంతాల నుంచి కాలనీల్లోని మండపాల వద్దకు వినాయక విగ్రహాలను తీసుకొచ్చే క్రమంలోనే భారీగా స్వాగత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గణనాథుడి ఆశీర్వాదాన్ని పొందేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. 9 రోజులపాటు విశేష పూజలు అందుకున్న అనంతరం వైభవంగా నిమర్జనోత్సవ కార్యక్రమలు నిర్వహిస్తారు. దీనివల్ల  వినాయకుని పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందని సంప్రదాయం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -