భువనగిరి మండలంలోని నమాత్ పల్లి గ్రామంలో స్వాతి నక్షత్రం సందర్భంగా స్వయంభు శ్రీ సుదర్శన పూర్ణగిరి లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీనరసింహస్వామి ఉపాసనకులు బత్తిని రాములు గౌడ్ స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, అష్టోతతరం , అలంకార సేవలు నిర్వహించారు. యాదాద్రి జిల్లా తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మూలల నుంచి ఈ క్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు గిరి ప్రదక్షిణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి పవన్ కుమార్ శర్మ, కుమార్ గౌడ్, పరమేశ్వర్ రెడ్డి, వెంకట్ గౌడ్, గుండాల సత్యనారాయణ, ఇంద్రారెడ్డి, బత్తిని వెంకటేష్ తో పాటు పలువు భక్తులు పెద్ద ఎత్తున పాలగొన్నారు.