ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు..

Special pujas at Anjaneya Swamy temple..నవతెలంగాణ – మద్నూర్
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్ర లో భాగంగా మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలో సలబత్పూర్ రాజ్యాంగ పరిరక్షణ కోసం పాదయాత్రలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరాస్ సాయిలు, సలబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనుమంతు యాదవ్, సలాబత్పూర్ చిన్న షక్కర్గ ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాండురంగ పాటిల్ దిగంబర్ మద్నూర్ గ్రామ నాయకులు బండి గోపి బండి దత్తు కర్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love