
మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి బ్రహోత్సవాలు బ్రహ్మండంగా జరుగుతున్నాయి. శనివారం నిర్వహించిన లక్ష్మి నరసింహ స్వామి శకటోత్సవానికి అదనపు జిల్లా న్యాయమూర్తి తరణి హజరయ్యారు.అనంతరం అండాళ్ స్థూపాన్ని దర్శించుకున్నారు.అలయ పాలకవర్గం సభ్యులు,ఆర్చకులు అదనపు న్యాయమూర్తికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు.ఆలయంలో ఆర్చకులు ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేయించారు.అదనపు జిల్లా న్యాయమూర్తిని శాలువ కప్పి సన్మానించి జ్ఞాఫికను అందజేసినట్టు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జెల్లా ప్రభాకర్ తెలిపారు.