– భక్తిశ్రద్దలతో కళ్యాణం…
నవతెలంగాణ – అశ్వారావుపేట
గుడి – పందిరి ఏదైతేనేం అందులో శ్రీరామ నవమి నిర్వహణ ప్రధానం. ఆలయం ఉన్న ఊర్లో అంగరంగ వైభవంగా.. అది లేని వాడల్లో పచ్చని తోరణాలు పందిరిలో సాదా సీదాగా మండల వ్యాప్తంగా శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం సీతారాముల కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం దైవం ప్రసాదాలు పంపిణీ చేసి, బెల్లం పానకం పంచారు. ప్రతీ మత పరం అయిన పండుగలోనూ సామాజిక క్షేమ దృక్పథం ఉంటుంది. ఉండాలి. అలాంటి దృక్పధం ఉన్న పండుగలు, పర్వదినాలు ఎన్ని యుగాలు గడుస్తున్నా ఉనికిలో ఉంటాయి. మనుగడలో ఉంటాయి కూడా. మండే ఎండలు కావడంతో తాటి ఆకుల చలువ పందిళ్ళు, పానకం వడపప్పు, తదితర ప్రసాద రూప ఆహారం, అన్నదానం లాంటి కార్యక్రమాలు ఎన్నో పేద, నిరుపేద, మధ్యతరగతి, సంచార జీవులకు, పాదచారులకు, బాటసారులకు (దీస్ ఆల్ హెల్ప్ ఫుల్ ఫర్ హోమ్ లెస్ పీపుల్ )కు ఎంతో ఉపశమనం, ఆకలి, అలసట తీర్చేవిగా.. మిగతా ప్రజానికానికి ఆద్యాత్మిక చింతన, ఆహ్లాదం పెంచేవిగా ఉండటమే ఈ శ్రీరామ నవమికి ఇంత ఆదరణ అని చెప్పుకోవచ్చు.