నవతెలంగాణ-సారంగాపూర్: మండలంలోని జామ్ గ్రామంలోగల సీతా రామ ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు తిరునగరి రామకృష్ణమాచార్యులు, కార్తీక్ ఆచార్యులు వేద మంత్రోత్సవాలతో రెండ్రోజుల పాటు ఆదివారం రామనవమి సందర్భంగా శ్రీ సీత రాముల కళ్యాణ మహోత్సవం సోమవారం శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. రాత్రి గరుడవాహన పల్లకి సేవ.అనంతరం ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.