
మున్సిపల్ కార్పొరేషన్ సిపిఓ(చీఫ్ ప్లానింగ్ అధికారి) గా శ్రీధర్ రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. మొదట నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ కలిశారు. అనంతరం నిజామాబాద్ నుడా చైర్మన్ కేశ వేణును ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆయనను వేణు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కేశ మహేశ్, రామర్తి గోపి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.