నవతెలంగాణ-రాయపోల్: ప్రభుత్వం చేపట్టిన తహసిల్దార్ బదిలీలలో భాగంగా రాయపోల్ మండలం తహసిల్దార్ గా విధులు నిర్వహించిన దివ్య బదిలీపై కొమురవెల్లి మండలానికి బదిలీపై వెళ్లారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భూసేకరణ విభాగంలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రాయపోల్ నూతన తహసిల్దారుగా బదిలీపై వచ్చారు. గురువారం తహసిల్దార్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. కార్యాలయ సిబ్బంది తహసిల్దార్ శ్రీనివాస్ కు స్వాగతం పలికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లప్పుడూ మండలంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కారం చేసి రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కృషి చేస్తానన్నారు. అలాగే ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పై అధికారుల సహకారం తోటి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఎలాంటి సమస్యలు పెండింగ్ లేకుండా భూముల రిజిస్ట్రేషన్, విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రైతులకు పట్టా పాసు పుస్తకాలు ఏలాంటి పనులన్నీ వెంట వెంటనే పూర్తి చేస్తామన్నారు. అనంతరం కార్యాలయ అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రైతులకు ప్రజలకు జవాబుదారీ తనంగా ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా పనులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ భాను ప్రకాష్, సీనియర్ అసిస్టెంట్ నాగరాజ్, సిబ్బంది అంబదాస్, ప్రవీణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.