అభివృద్ధి పనులను శంకు స్థాపన చేసిన శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ – తొగుట 
తుక్కాపుర్ గ్రామంలో అభివృద్ధి పనులను దుబ్బా క నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. మంగళవారం రాత్రి ముది రాజ్ లకు పెద్దమ్మ దేవాలయం వద్ద మినీ పంక్షన్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తుక్కాపూర్ గ్రామంలో నీటి ఎద్దడి నివారణ కోసం రూ. 32 లక్షల తో బోరు బావి, మోటార్, ట్యాంక్, పెద్దమ్మ దేవాలయం వద్ద ముది రాజ్ సంఘం సంఘానికి రూ. 10 లక్షలు వ్యయం నిర్మాణం చేసేందుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో తోగుట ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి, తుక్కాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకు విజయ్ రెడ్డి (అమర్) భూపా ల్ రెడ్డి, తుక్కాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షు డు బర్రింకల స్వామి, మాజీ సర్పంచులు కొండల్ రెడ్డి, కొంగరి నర్సింలు, భాస్కర్ రెడ్డి, నరసవ్వ, మల్లారెడ్డి, మహిపాల్ రెడ్డి, ఉప్పలయ్య, కృష్ణ, కిష్టయ్య ,హర్షద్, జహంగీర్, నరేష్, భూపతి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love