Saturday, May 30, 2026
E-PAPER
Homeసినిమా'శ్రీనివాస మంగాపురం` రిలీజ్ డేట్ ఫిక్స్

‘శ్రీనివాస మంగాపురం` రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -

డైరెక్టర్ అజయ్ భూపతి దర్శ కత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘శ్రీనివాస మంగాపురం’. హీరోగా జయకృష్ణ ఘట్టమనేని పరిచయం అవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు అన్న కొడుకుగా భారీ అంచనాల మధ్య ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవు తున్నారు. నిర్మాత అశ్వినీ దత్ సమర్పణలో, జెమినీ కిరణ్ తన ‘చందమామ కథలు’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా శ్రీను- మంగా పాత్రలని పరిచయం చేస్తూ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో జయకృష్ణ మాట్లాడుతూ,’ తాతయ్య నాకు దేవుడితో సమానం. ఇది నా తొలి చిత్రం. అజయ్ భూపతి ఈ కథ చెప్పినప్పుడు ఇందులో ఉన్న ఎమోషన్స్, నా పాత్రలోని డెప్త్ చాలా ఆకట్టు కున్నాయి. ఈ క్యారెక్టర్ ద్వారా నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవచ్చని, నటుడిగా నిరూపించుకునే అవ కాశం దొరుకుతుందని భావిం చానుఅని తెలిపారు. 'సూపర్ స్టార్ కృష్ణ క్వాలిటీస్ జయకృష్ణలో ఉన్నాయి. కచ్చితంగా జయకృష్ణ చాలా పెద్ద హీరో అవుతాడు. ఈ సినిమా ఆడియో ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది అని డైరెక్టర్ అజయ్ భూపతి చెప్పారు. తమ్మారెడ్డి భరద్వాజ , డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు , ఆదిశేషగిరిరావు తదితరులు ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. కె. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ,’ ‘శ్రీనివాస మంగాపురం’ అనే పేరు పెట్టడమే ఈ సినిమా మొదటి విజయంఅని అన్నారు. 'ఈ సినిమా జూలై 9 మీ ముందుకు వస్తోంది అని అశ్వినీ దత్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -